NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులకు పంపిణీకి సిద్ధంగా ఉన్న జనుములు

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండలంలో మొదటి విడతగా 18 క్వింటాళ్ల జనుములు విత్తనాలు రైతులకు పంపిణీ చేయుటకు రైతుబరోసా కేంద్రంలో సిద్ధంగా ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి తెలిపారు, గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రామనపల్లెలో 10 క్వింటాళ్లు, చెన్నూరు రైతు భరోసా కేంద్రంలో 5 క్వింటాళ్లు,కనపర్తిలో రైతు భరోసా కేంద్రంలో 3 క్వింటాళ్లు, జనుమ విత్తనాలు రైతులకు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలియజేశారు, కేజీ జనుము పూర్తి ధర రూ 84 రూపాయలు ఉండగా రైతు వాటా రూ.42 రూపాయలు సబ్సిడీ రూ.42 గా ఉందన్నారు, రైతుకు ఉన్న విస్తీర్ణాన్ని బట్టి ఎకరాకు 10 కేజీల చొప్పున గరిష్టంగా 50 కేజీలు చొప్పున రైతులకు ఇవ్వబడతాయని ఆమె అన్నారు,కడప సహాయ వ్యవసాయ సంచాలకులు డి సుబ్బారావు చెన్నూరు గ్రామంలో రైతులకు జనుము విత్తనాలు అందజేసి జనుము విత్తనాల పంపిణీని మొదలు పెట్టడం జరిగిందని ఆమె తెలిపారు జనములు కావలసిన రైతులు, రైతులకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం, ఫోన్ నెంబర్ ఆధార్ తో రైతు భరోసా కేంద్రానికి సందర్శించి రైతులు విత్తనాలు పొందవలెనని ఆమె తెలిపారు , అలాగే కొత్తగా రైతు భరోసా కి దరఖాస్తు చేసే రైతులు రైతు భరోసా కేంద్రాలలో ఈనెల 30 ఆమె తెలియజేశారు, లోపల నమోదు చేసుకోవాలని ఈకార్యక్రమంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ డి చరణ్ కుమార్ రెడ్డి,జి రామకృష్ణారెడ్డి యు,సృజన పాల్గొన్నారు.

About Author