PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీనియస్ గ్లోబల్ స్కూల్ ని సిజ్ చేసి తొలగించాలి

1 min read

కర్నూల్ జిల్లా ఎడ్యుకేషన్ ఏ డి శ్యాములు పాల్ కి ఫిర్యాదు చేసిన నాయకులు

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:   గోనెగండ్ల పట్టణంలో ఉన్న జీనియస్ గ్లోబల్ స్కూల్  ని సిజ్ చేసి అక్కడి నుంచి పాఠశాల ని తొలగించాలి అని రాయలసీమ ఐక్య విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోనేటి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు రఘునాథ్ లు జిల్లా స్కూల ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్యాములు పాల్ కి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు జీనియస్ గ్లోబల్ స్కూల్  పెట్రోల్ బంక్ అనుకోని ఉంది, అలాగే రాష్ట్ర రహదారి పక్కనే స్కూల్ ఉండడం వల్ల విద్యార్థులు కు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఈ ప్రమాదం వల్ల చాలా వరకు ప్రాణ మరియు ఆస్థి నష్టం జరుగొచ్చు అని , అందువల్ల అ పాఠశాల గుర్తింపు రద్దు చేసి అక్కడి నుండి పాఠశాల ని తొలగించాలి అని వారు అన్నారు. గతంలో ఈ పాఠశాలని సిజ్ చేసి తొలగించాలి  అని ఏం ఈ ఓ, ఏం ఆర్ ఓ, సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు చేయగా వారు ఇచ్చిన ఆదేశాలను అ పాఠశాల యాజమాన్యం తుంగలో తొక్కుతుంది. కావున ఈ పాఠశాలపై కఠిన చర్యలు తీసుకొని పాఠశాల ని తొలగించాలి అని వారు తెలపగా ఏ డి శ్యాముల పాల్  సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటాం అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో నాయకులు నవీన్, కుమార్, రామ్, ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు.

About Author