జియో కొత్త సంవత్సర కానుక !
1 min read
పల్లెవెలుగువెబ్ : ప‌్రముఖ టెలికం సంస్థ జియో తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. రూ. 2545 ప్రీపెయిడ్ ప్లాన్‌పై హ్యపీ న్యూయర్ ఆఫర్‌ను యూజర్లకు జియో ప్రకటించింది. సాధారణంగా జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2545 యూజర్లకు 336 రోజుల వ్యాలిడిటీతో వచ్చేది. హ్యాపీ న్యూయర్ ఆఫర్‌లో భాగంగా ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే యూజర్లు అదనంగా 29 రోజుల వ్యాలిడిటీను పొందవచ్చును. దీంతో 365 రోజులపాటు వ్యాలిడిటీ యూజర్ల సొంతమవుతుంది. కాగా ప్లాన్ కేవలం 2022 జనవరి 2 వరకే అందుబాటులో ఉండనుంది.