మార్కెట్లను కిందకి లాగిన జియోపొలిటికల్ టెన్షన్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఇండియన్ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 17000 దిగువన ట్రేడ్ అవుతోంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న జియో పొలిటికల్ టెన్షన్స్ స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలకు కారణమైంది. ఉక్రెయిన్ బార్డర్లలో రష్యా పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు కూడ పెద్ద ఎత్తున పెరగడం, అమెరికా ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీంతో సోమవారం పెద్ద ఎత్తున సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1296 పాయింట్ల నష్టంతో 56856 వద్ద, నిఫ్టీ 392 పాయింట్ల నష్టంతో 16,900 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.