భూవివాదం.. ఆరోపణలు ఖండించిన పత్తికొండ ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగువెబ్ : 33 ఎకరాల పొలం తన అల్లుడు విజయ రెడ్డి లాక్కున్నారనే దానిపై పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి స్పందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ‘‘నాపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నా.. నేను కానీ నా పార్టీకి చెందిన వారు కానీ 33 ఎకరాల భూమి కాదు.. ఒక్క ఎకరా భూమి లాకున్నట్లు నిరూపణ అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా… టీడీపీ నేతలు అసలు విషయాలు తెలియకుండా ఆరోపణలు చేస్తే సహించేది లేదు..’’ అని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు.