అక్రమ కొళాయిలకు 2వేలు డిపాజిట్ చెలించి కనెక్షన్లు పొందండి
1 min read
ఆటోద్వారా ప్రచారం చేస్తున్న పంచాయతీ సెక్రటరి, వైఎస్సార్సీపీ నాయకులు దుకాణాల బకాయిలను కట్టాలని నోటీసులు ఇస్తున్న సెక్రటరి తదితరులు
హొళగుంద న్యూస్ నేడు : గ్రామంలో అక్రమంగా కొళాయి కనెక్షన్లు వేసుకుని వాడుకుంటున్న వారు వెంటనే రూ.2 వేలు డిపాజిట్ చెల్లించి సక్రమం చేసుకోవాలని హొళగుంద పంచాయతీ సెక్రటరి రాజశేఖర్గాడ్ కోరారు. శుక్రవారం ఆయన వైఎస్సార్సీపీ నాయకుడు వంపావతితో కలిసి ఆటో ద్వార గ్రామంలో ప్రచారం చేపట్టారు. ఈ నందర్భంగా సెక్రటరి మాట్లాడుతూ హొళగుంద గ్రామంలో 940 వరకు అక్రమ కొళాయిలు ఉన్నాయని పంచాయతీకి ఎలాంటి డిపాజిట్, పన్ను చెల్లించకుండ నీటిని వాడుకుంటున్నట్లు తెలిపారు. అలాంటి వారు ఈ నెలాఖిరికెల్లా రూ.2 వేలు డిపాజిట్ చెల్లించి తమ కనెక్షన్లను సక్రమం చేసుకోవాలని సూచించారు. ఆ డబ్బులతో పాటు వంచాయతికి వచ్చే నిధులతో గ్రామాభివృద్ధి పనులకు వాడుకుంటామన్నారు. గడువు లోపల డిపాజిట్ చెల్లించి నక్రమం చేసుకోకపోతే కనెక్షన్లను తొలగిస్తామని అడ్డు పడితే పోలీసుల ద్వార చర్యలు తీసుకోవాల్సీ ఉంటుందని హెచ్చరించారు. అక్రమ కనెక్షన్ పొందిన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.దుకాణాల యజమానులు బకాయిలు చెల్లిందండి. బస్టాండులో వేలం ద్వార దుకాణాలు పొందిన వారు వెంటనే బకాయిలను చెల్లించాలని పంచాయతీ సెక్రటరి.