విద్యార్థి సమస్యలపై ఉద్యమానికి సిద్ధం కండి
1 min read– ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా
పల్లెవెలుగు, వెబ్ పత్తికొండ : కామ్రేడ్ ఈశ్వర్ రెడ్డి భవనం నందు ఎస్ఎఫ్ఐ జనరల్ బడి సమావేశం జరిగింది. ఈ సమావేశం కు అధ్యక్షత పత్తికొండ ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు వినోద్ వహించగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల సమస్యల పరిష్కారం చేస్తానని చెప్పి ప్రభుత్వం రాకముందు విద్య రంగాన్ని మార్పులు తీసుకొస్తానని అనేక హామీలు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మధ్యాహ్న భోజన పథకంలో సరైన పోషకాలు కల్పించకపోవడం ,మధ్యాహ్న భోజనం, ప్రభుత్వ హైస్కూలలో,హాస్టల్లో సన్న బియ్యం కల్పిస్తామని చెప్పి ఇవ్వలేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా హాస్టల్లో కాస్మెటిక్ చార్జెస్ పెంచాలి, చలికాలం హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు చలిని తట్టుకునేటువంటి దుప్పటిలు ఇవ్వాలి , హాస్టల్ లో సరైన కిటికీలు లేనందువల్లన చలికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పత్తికొండ నుండి మారెళ్ళ వరకు విద్యార్థి బస్సు కొనసాగించాలి. పత్తికొండ నుండి ఆస్పరి వరపు విద్యార్థి బస్సు నడపాలి. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కళాశాలలో రెగ్యులర్ మ్యాథ్స్ లెక్చలర్ ని నిర్మించాలి మరియు కళాశాలలో తాగునీటి సమస్య పరిష్కరించాలి,విద్యార్థిని విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ సరైన సమయంలో అందించాలి ఈ సమస్యల పరిష్కారానికై ప్రతి విద్యార్థి ఉద్యమానికి సిద్ధం కావాలి.ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా ఆధ్వర్యంలో పత్తికొండ నూతన మండల కమిటీ ఎన్నిక. మండల కార్యదర్శి వినోద్ మండల అధ్యక్షులు జావిద్ ఉపాధ్యక్షులు విష్ణు,రాజేశ్వరి, ఖురాన్ ఆదర్శ్ నరసింహ సహాయక కార్యదర్శి కోటి, నాగార్జున,రఫీ,15 మంది తో కమిటి సభ్యులు ఎన్నుకోవడం జరిగింది.