PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికల సమరానికి సిద్ధం కండి..

1 min read

కాంగ్రెస్ శ్రేణులకు డిసిసి పిలుపు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎన్నికల సమరానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే బాబురావు  పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో బాబురావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని స్వేచ్ఛ ఉంటుందని రాష్ట్రవ్యాప్తంగా నూట డెబ్భై అయిదు అసెంబ్లీ స్థానాలకు, ఇరవై అయిదు పార్లమెంటు స్థానాలకు కలిపి దాదాపు పదమూడు వందల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుందని, అదే ప్రాంతీయ పార్టీలలో ఒకరిద్దరికే అవకాశం కలిగిస్తున్నారని విమర్శించారు. దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ అని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు దేశ ప్రజల భవిష్యత్తు కోసం దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నారని ఇటీవల కర్ణాటకలో బిజెపి ఓడిపోవడానికి కారణం ఆ రాష్ట్ర ప్రజల ఆకలికేకలే కారణమని, దోచుకుని దాచుకోవడమే బిజెపి అభిమతమని మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ  ప్రైవేట్ సంస్థలను ప్రభుత్వ రంగ సంస్థలుగా మారిస్తే, నేడు ప్రధాని మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్నారని ప్రతి ఒక్కటి ప్రైవేట్ పరం చేస్తూ అంబానీ, ఆదానీలకు దోచిపెడుతున్నాడని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేయడానికి సిద్ధమైన బిజెపికి దేశ ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని మోడీ హిట్లర్ లా వ్యవహరిస్తున్నారని, పోరాటం చేస్తే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని మన పిల్లల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని బిజెపి వస్తే హిందువులే  వంద శాతం నష్టపోతారని కాంగ్రెస్ పాలనలో మూడు సెంట్లలో ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని, కాంగ్రెస్ పాలనలో అన్ని కులాలకు మతాలకు న్యాయం జరుగుతుందని ఎవరికి నష్టం జరగలేదని పేదలకు భూ పంపిణీ చేసింది భూ సంస్కరణలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని పేద ప్రజలకు భూములు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించేదాకా కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేశారని అభిప్రాయపడ్డారు. నేటి బిజెపి ప్రభుత్వం కుల, మతాల మధ్య చిచ్చు పెట్టడమే ధ్యేయంగా పనిచేస్తుందని మోడీ, అమిత్ షాలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని విమర్శించారు. అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి పని చేయాలని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో ఎవరికి టికెట్టు వచ్చిన అందరూ కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉండవల్లి వెంకటన్న, మాజీ మంత్రి మూలింటి మారెప్ప, విశ్రాంత ఐఏఎస్ అధికారి రామస్వామి పిసిసి ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ పిసిసి అధికార ప్రతినిధి బి రామాంజనేయులు పీసీసీ సహాయ కార్యదర్శి చిప్పగిరి లక్ష్మీనారాయణ నగర కాంగ్రెస్ అధ్యక్షులు జాన్ విల్సన్ డిసిసి ఉపాధ్యక్షులు బి బతుకన్న రియాజుద్దీన్, దిలీప్ దోక బి మహేంద్ర నాయుడు ఏవి నాయుడు ప్రధాన కార్యదర్శి బి నీలకంఠప్ప, పోతుల శేఖర్ కే సత్యనారాయణ గుప్త, ఎన్ చంద్రశేఖర్ రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు కొత్తపేట మున్న, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఈ లాజరస్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎస్ ప్రమీల మైనార్టీ సెల్ సిటీ అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్ మహిళా కాంగ్రెస్ సిటీ అధ్యక్షురాలు లలిత జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఖాద్రి పాషా, డిసిసి కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి అబ్దుల్ హై దేవి శెట్టి వీరేష్ గణేష్ మురళి యు శేషయ్య బోయ కామయ్య కాంగ్రెస్ నాయకులు ఎన్ సి బజారన్న షేక్ మాలిక్ మహిళా కాంగ్రెస్ కే వెంకటలక్ష్మి హైమావతి ఆర్ మద్దమ్మ, ఎంపీ మరియు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వివిధ నియోజకవర్గాల కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు మొదలు గారు పాల్గొన్నారు.

About Author