మలబద్ధకం సమస్యను ఇలా దూరం చేసుకోండి !
1 min readపల్లెవెలుగు వెబ్ : మలబద్ధకం సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కొందరు దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆ తర్వాత చాలా ఇబ్బంది పడుతుంటారు. సులువైన పరిష్కారాల ద్వార ఈ సమస్యను అధిగమించవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. పేగుల్లో కదలికలు బాగుంటే మలబద్ధకం సమస్య ఉండదు. ఇందుకోసం వేయించిన సోంపు బాగా ఉపయోగపడుతుంది. వేయించిన సోంపు జీర్ణక్రియను పెంచుతుంది. విరేచనాలు సాఫీగా అయ్యేలా చేస్తుంది. ఒక టీస్పూన్ వేయించిన సోంపును ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లలో వేసుకుని రాత్రి పడుకునే ముందు తాగాలి. మలబద్ధకం నివారణలో పీచుపదార్థం కీలకపాత్ర పోషిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. ఈ పీచుపదార్థం అంజీర్‌లో పుష్కలంగా లభిస్తుంది. ముందుగా అంజీర్‌ను గోరువెచ్చటి నీళ్లలో నానబెట్టి తరువాత తీసుకోవాలి. ఇది రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. మలబద్ధకం రాకుండా ఉండాలంటే తక్కువ ఆహారం, ఎక్కువసార్లు తీసుకోవాలి. రాత్రి భోజనానికి, పడుకోవడానికి మధ్య కనీసం మూడు గంటలు ఉండేలా చూసుకోవాలి. శారీరక వ్యాయామం తప్పక ఉండేలా చూసుకోవాలి. రోజూ కనీసం అరగంట పాటు వాకింగ్ చేయడం దినచర్యలో భాగంగా చేసుకోవాలి.