వ్యాక్సిన్ సర్టిఫికెట్ వాట్సాప్ లో ఇలా పొందండి
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన వ్యాక్సిన్ సర్టిఫికెట్లు ఇక వాట్సాప్ ద్వార అందనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కాంటాక్ నంబర్ .. +91 90131 51515 సేవ్ చేసుకుని, ‘కోవిడ్ సర్టిఫికెట్ ’ అని మెసేజ్ పంపాలి. ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి , క్షణాల్లో సర్టిఫికెట్ పొందొచ్చు. ఈ విధానం చాలా సులభమని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్వీట్ చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ కావాలనుకునే వారికి ఈ విధానం చాల సులభమని, ఎలాంటి ఇబ్బందులు, ఎదురుచూపులు లేకుండా వ్యాక్సిన్ సర్టిఫికెట్ అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.