PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా శిక్షణ పొందండి

1 min read

– శిక్షణ కార్యక్రమంలో వైద్య సిబ్బంది దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా శిక్షణ పొందాలని వైద్య సిబ్బందికి జిల్లా కలెక్టర్ డా.జి.సృజన దిశానిర్దేశం చేశారు. సోమవారం ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నందు కమ్యూనిటీ వైద్య సిబ్బందికి ఇచ్చే శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణ తీసుకుంటున్న ఎంఎల్హెచ్పిలు ఏ వ్యాధికి ఏ విధంగా చికిత్స అందజేయాలనేది ప్రాక్టికల్ రూపంలో చూసి చికిత్స ఇవ్వడం ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాము కాటు, కుక్క కాటు, రోడ్డు ప్రమాదాలు తదితర కేసులను పట్టణ ఆరోగ్య కేంద్రాలకు పంపకుండా గ్రామ స్థాయిలోనే మెరుగైన వైద్యం అందించేందుకు ఈ శిక్షణ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. మీరు విద్యార్థులుగా విద్యను అభ్యసించే సమయంలో ఎక్కువ శాతం విషయ పరిజ్ఞానం మీదే దృష్టి పెట్టింటారని, దాని వలన చాలా మందికి ఐవి, ఇంజెక్షన్ వేసే అనుభవం చాలా తక్కువగా ఉంటుందని, ఈ వారంతాపు శిక్షణ కార్యక్రమం ద్వారా వైద్యలు మీకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అదే విధంగా శిక్షణ ఇచ్చే శిక్షకులు కూడా కేవలం సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టి సమయం వృధా చేయకుండా ఎక్కువ శాతం ప్రాక్టికల్స్ ద్వారా అవగాహన కల్పిస్తూ ఇంజక్షన్ ఏ విధంగా పట్టుకోవాలి, ఏ విధంగా వేయాలని అనే దాన్ని ప్రాక్టికల్స్ రూపంలో చుయించాలని కలెక్టర్ శిక్షకులకు సూచించారు. ఎంఎల్హెచ్పిలు ఈ శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని వారి మెళకువలను పెంచుకొని గ్రామాల్లోని ప్రజలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల చికిత్స కోసం పట్టణాల్లోని ప్రైవేట్ ఆసుపత్రి కేంద్రాలకు వెళ్లకుండా గ్రామాల్లోనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వారికి పూర్తి స్థాయిలో వైద్య చికిత్సలు అందించేలా శిక్షణ తీసుకోవాలని కలెక్టర్ ఎంఎల్హెచ్పిలకు దిశా నిర్దేశం చేశారు.అంతకుముందు జిల్లా వైద్యాధికారి డాక్టరు రామగిడ్డయ్య మాట్లాడుతూ శిక్షణలో మొత్తం 482 మంది వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ నందు ఎంఎల్హెచ్పిలు గా విధులు నిర్వహిస్తున్నారన్నారు. వీరిని 11 బ్యాచ్ లుగా విభజించి 6 రోజుల పాటు నర్సింగ్ కళాశాల నందు థియరీ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల నందు ప్రాక్టికల్స్ రూపంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. వీరు ముఖ్యంగా విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో ప్రాథమిక చికిత్స, పాము కాటు, కుక్క కాటు, ఇంజెక్షన్స్ ఇవ్వడం, బ్యాండేజస్, సిపిఆర్ పై కూడా వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి సమర్థవంతంగా విధులు నిర్వహించేలా వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ జాయింట్ డెరైక్టర్ డా.ఎస్.దేవసాగర్, జిజిహెచ్ సూపరింటెండెంట్ నరేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్.జ్యోతి, శిక్షకులు ప్రొఫెసర్ పి.సరళ, ప్రొఫెసర్ జి.మంజుల, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author