హోటల్ గ్రాండ్ ఆర్య కాన్ఫరెన్స్ లో గెత్సమనే ఇంగ్లీష్ ఆరాధన
1 min read
వాక్యోపదేశకులు రెవరెండ్ పి. జీవన్ కుమార్
వివిధ కళాశాలలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు
పరిసర ప్రాంత,స్థానిక ప్రజల ఈ ఆరాధన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : స్థానిక ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లో హోటల్ గ్రాండ్ ఆర్య కాన్ఫరెన్స్ హాల్ లో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు రెవరెండ్ పాస్టర్ పి.జీవన్ కుమార్ వాక్యోపదేశ ఆధ్వర్యంలో గెత్సమనే ఇంగ్లీష్ ప్రేయర్(ఆరాధన) జరుగుచున్నది. ఈ ఆరాధన కార్యక్రమానికి నగరంలోని ఎంతోమంది మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు సుమారు 200 మంది పాల్గొని దైవాశీస్సులు అందుకుంటున్న రన్నారు. క్రైస్తతత్వం మతం కాదని ఏసుక్రీస్తుని చేరుకునే సన్మాన మార్గమని ఆయన బోధనల ద్వారా తెలియజేయుచున్నారు. మారు మనసు అంటే క్రీస్తుని కలిగి ఉండటం. క్రీస్తును వెంబడి మారుమనస్సు కలిగి ఉండటం ఇది మతమార్పిడి కాదని మనసు మార్గమని అన్నారు. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థి, విద్యార్థులు చెడు మార్గాలను విడచి. దైవ సత్యాన్ని తెలుసుకొని సన్మార్గంలో జీవిస్తూన్నట్లు తెలిపారు. చక్కటి స్తుతి గీతాలతో దైవజనులు జీవన కుమార్ ఇంగ్లీష్ వాక్యోపదేశంతో నడుస్తున్న ఆరాధనకు పరిసర ప్రాంత ప్రజలు, విద్యార్థినీ, విద్యార్థులు సద్వినియోగపరుచుకోవాల్సినదిగా ఆహ్వానం పలుకుతున్నట్లు కోరారు.
