PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

1,255 కోట్లతో పారిపోయిన ఘ‌నీ ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : తాలిబ‌న్ల ఆక్రమ‌ణ‌తో ఆప్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘ‌నీ దేశాన్ని వ‌దిలి పారిపోయాడు. ఈ క్రమంలోనే వెళ్తు, వెళ్తు 1,255 కోట్లు డ‌బ్బుతో పారిపోయాడ‌ని త‌జకిస్థాన్ లోని ఆఫ్గన్ రాయ‌బారి మ‌హ‌మ్మద్ జ‌హీర్ అఘ్బార్ ఆరోపించారు. వెంట‌నే ఆయ‌న్ని ఇంట‌ర్ పోల్ అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఓ నిధిని కొల్లగొట్టిన దేశ ద్రోహిలా ఘ‌నీ పారిపోయాడ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. యూఏఈకి ప‌రారైన‌ట్టు అఘ్బార్ తెలిపారు. ఈ విష‌య‌మై ఇంట‌ర్ పోల్ కు తాను విన‌తి ప‌త్రం అందిస్తాన‌ని చెప్పారు. ఇంతవ‌ర‌కు ఎలాంటి విన‌తి ప‌త్రం త‌మ‌కు అంద‌లేద‌ని త‌జ‌కిస్థాన్ ఇంట‌ర్ పోల్ అధికారి నజీవ్ తెలిపారు.

About Author