ఘంటసాల…చిరస్మరణీయుడు
1 min readపద్మశ్రీ ఘంటసాల గాన కళా సమితి అధ్యక్షులు సుస్వరం వాసుదేవ మూర్తి
కర్నూలు, పల్లెవెలుగు: భాగవతం శ్లోకాలను భక్తిశ్రద్ధలతో పాడి… భక్తులను భక్తిపారవశ్యంలో ముంచిన గానగంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల చిరస్మరణీయుడన్నారు పద్మశ్రీ ఘంటసాల గాన కళా సమితి అధ్యక్షులు సుస్వరం వాసుదేవ మూర్తి, లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, డిప్యూటీ కలెక్టర్ కొండయ్య, ప్రముఖ వైద్యులు డా. చంద్రశేఖర్, డా. శంకర్ శర్మ. మంగళవారం 51వ వర్ధంతి సందర్భంగా నగరంలోని ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా ఘంటసాల స్వరం వింటారని, అందుకే ఆయనను చిరంజీవి అని అభివర్ణించారు. భగవద్గీత అది వింటే మనసుకు ఎంత ఆహ్లాదం, మనశ్శాంతి కలుగుతుంది. అన్ని రకాలుగా మనిషికి ఆరోగ్యంగానే కాక మానసిక ధైర్యం కూడా ఇస్తుంది. అందుకే భగవద్గీత మనకు ఒక స్ఫూర్తి అటువంటి భగవద్గీతను మనందరికీ అందించిన ఆ మహానుభావుడిని స్మరించుకుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.