జియో ‘డేటా లోన్ ’.. సరికొత్త ఆఫర్ !
1 min readపల్లెవెలుగు వెబ్: మీరు వాడే డేటా ప్యాక్ వ్యాలిడిటీ అయిపోయిందా ?. అయితే.. వెంటనే మీరు లోన్ తీసుకోవచ్చు. ఇలాంటి ఆఫర్ తో జియో మీ ముందుకు వచ్చింది. జియో వినియోగదారులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా.. డేటా కొరత రాకుండా చూసుకునేందుకు జియో ఎమర్జెన్సీ డేటా లోన్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. జియో ప్రీపెయిడ్ వినియోగదారులందూ ఈ ఫీచర్ ను ఉపయోగించవచ్చని జియో వెల్లడించింది. ఎమర్జెన్సీ డేటా లోన్ ఫీచర్ కింద.. జియో వినియోగదారులు డేటా లోన్ తీసుకోవచ్చు. ఆ తర్వాత డబ్బులు చెల్లించవచ్చు. ప్రతి ఒక్కరూ ఐదు డేటా రీచార్జ్ ప్యాక్ ల వరకు లోన్ తీసుకోవచ్చు. ఒక్కో ప్యాక్ తో 1 జిబి డేటా వస్తుంది. అందుకు 11 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. లోన్ వాడుకోవాలంటే.. అప్పటికే వ్యాలిడిటీ ముగియని ప్లాన్ ఉండాలి. ఆ బేస్ ప్లాన్ చెల్లుబాటయ్యే వరకు తీసుకున్న డేటా వినియోగించుకోవచ్చు.
డేటా లోన్ ఎలా తీసుకోవాలి :
- మై జియో యాప్ లోని మెనూ బటన్ లో
ఎమర్జెన్సీ డేటా లోన్
తీసుకోవాలి. - ప్రొసీడ్ ను క్లిక్ చేయాలి.
- ఐదు 1 జిబి ఎమర్జెన్సీ డేటా ప్యాక్ లు కనిపిస్తాయి.
- ఇక్కడ ‘గెట్ ఎమర్జన్సీ డేటా’ ను క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా ఐదుసార్లు డేటా లోన్ పొందే అవకాశాన్ని జియో కస్టమర్లకు కల్పిస్తోంది.