PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాలిక  ఆత్మహత్య ..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నందికొట్కూరు పట్టణంలోని పగిడ్యాల రోడ్డు లోని బైరెడ్డి నగర్ లో బాలిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం నందికొట్కూరు పట్టణంలో చోటుచేసుకుంది.  స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు పగిడ్యాల గ్రామానికి చెందిన  బోయ  రమణమ్మ, బోయ చిన్న రాముడులు నివాసం ఉంటున్నారు.  వీరి  కుమార్తె (11) పగిడ్యాల మోడల్ స్కూల్లో ఆరవ తరగతి చదువుతుంది. దీపావళి పండుగ సందర్భంగా పాఠశాలకు సెలవులు కావడంతో ఇంటి దగ్గర ఉంది. సోమవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో తలుపులకు గడియా వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని టౌన్ సి ఐ ప్రకాష్ కుమార్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

About Author