ఆర్జీవికి అమ్మాయిల పిచ్చిలేదు !
1 min readపల్లెవెలుగువెబ్ : ప‌్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఆయన సోదరి విజయలక్ష్మి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ యూట్యూట్ చానల్ ఇంటర్వ్యూలో విజయలక్ష్మి .. రాంగోపాల్ వర్మకు సంబంధించిన విషయాలు చెప్పారు. రాంగోపాల్ వర్మకి అమ్మాయిలంటే పిచ్చిలేదని ఆమె చెప్పారు. వర్మ మనస్తత్వం గురించి చిన్నప్పుడు జరిగిన విషయాల గురించి ఆమె చెప్పొకొచ్చారు. చిన్నప్పుడు మా ఇంటికి నా స్నేహితురాలు అనురాధ వచ్చింది. వచ్చిన వెంటనే ఆమెతో నీ కళ్లు చాలా బావున్నాయి అని చెప్పేశాడు. అది విని నేను షాక్ అయ్యా. ఆ తరవాత చాలాసార్లు నా స్నేహితురాలు మీ అన్న నన్ను పొగిడాడు అని చెప్పుకునేది. అయితే నేను వర్మతో.. దానికి మెల్లకన్ను, నీకు ఎలా నచ్చింది అని అడిగా.. దానికి అన్నయ్య ‘అస్సలు నేను ఆ అమ్మాయిని కూడా చూడలేదు.. ఏదో ఒక మాట అలా అనేశాను’ అని చెప్పాడు. మరోసారి బ్యాంకులో ఇంకో అమ్మాయి నవ్వు బాగుందని ఆమెతోనే చెప్పాడు.. అలా అన్నయ్య అమ్మాయిలను సంతోషపెట్టే మాటలే తప్ప ఏరోజు వారితో మిస్ బిహేవ్ చేసింది లేదు. అలాగే ఈ మధ్య అమ్మాయిలతో డ్యాన్స్‌లు వేయడం కూడా అలాంటిదే
అని అసలు విషయం ఆమె వివరించారు.