PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స‌రదా కోసం బాలిక‌లు శారీర‌క సంబంధం పెట్టుకోరు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : భార‌తీయ బాలిక‌లెవ‌రూ స‌ర‌దా కోసం శారీర‌క సంబంధం పెట్టుకోర‌ని మ‌ధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లి చేసుకుంటామ‌ని న‌మ్మక్కంగా చెబితే కానీ.. ఇలాంటి వాటికి అంగీక‌రించ‌రని తెలిపింది. అలా సంబంధం పెట్టుకోవాల‌ని భావించే పురుషులు ఎవ‌రైన దాని ప‌ర్యవ‌సానాల‌ను గుర్తుపెట్టుకోవాల‌ని కోర్టు సూచించింది. మ‌ధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి చెందిన ఓ మ‌హిళ‌ను ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి ప‌లుమార్లు అత్యాచారం చేశాడు. అయితే.. ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పడంతో ఆమె ఆత్మహ‌త్యాయ‌త్నం చేసింది. దీంతో ఆ యువ‌కుడిపై పోలీసులు అత్యాచారం కేసు న‌మోదు చేసి అరెస్టు చేశారు. బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌గా.. మ‌ధ్యప్రదేశ్ ఇండోర్ బెంచ్ విచార‌ణ జ‌రిపింది. ఆమెకు 21 సంవ‌త్సరాలు నిండాయ‌ని, ఇష్టప్రకార‌మే సంబంధం పెట్టుకున్నామ‌న్న వాద‌న‌తో కోర్టు ఏకీభవించ‌లేదు.

About Author