PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమ్మాయిలు క్రికెట్ ఆడాల్సిన అవ‌స‌రం లేదు !

1 min read
ప‌ల్లెవెలుగువెబ్ : విరాట్ కొహ్లీ వన్డే కెప్టెన్సీ ఊడటానికి బీసీసీఐ బాస్‌ సౌరవ్‌ గంగూలీనే ప్రధాన కారణమని భావిస్తున్న విరాట్‌ కోహ్లి అభిమానులు.. దాదా గతంలో చేసిన చిన్నచిన్న పొరపాట్లను ఎత్తిచూపుతూ సోషల్‌మీడియా వేదికగా ట్రోలింగ్‌కు దిగుతున్నారు. ఈ క్రమంలో గంగూలీ గతంలో అమ్మాయిలను ఉద్దేశిస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి కోహ్లి అభిమానుల కంటపడింది. గంగూలీని టార్గెట్‌ చేసేందుకు ఈ వీడియోను ప్రధాన ఆస్త్రంలా మార్చుకున్న కోహ్లి ఫ్యాన్స్‌, గంగూలీపై భారీ ఎత్తున నెగిటివ్‌ ప్రచారం మొదలుపెట్టారు. మూడేళ్ల క్రితం ఓ బెంగాళీ చాన‌ల్ లో గంగూలీ .. అమ్మాయిలు క్రికెట్ ఆడాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. త‌న కూత‌రు స‌నా గంగూలీ ప్ర‌స్తావన వ‌చ్చిన సంద‌ర్భంగా గంగూలీ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

About Author