NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భార‌త సైన్యంలోకి అమ్మాయిలు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : సైన్యంలో చేర‌డానికి అమ్మాయిల‌కు గ్రీన్ సిగ్నల్ అందింది. ఈ మేర‌కు ఉన్నత‌స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రక‌టించింది. నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ, నేవ‌ల్ అకాడ‌మీలో ప్రవేశం , శిక్షణ కోసం అమ్మాయిల‌ను కూడ అనుమ‌తించ‌నున్నట్టు కేంద్రం తెలిపింది. ఇప్పటి వ‌ర‌కు ఇంట‌ర్ చ‌దివిన , పెళ్లికాని అబ్బాయిలు మాత్రమే దీనికి అర్హులు. ఈ నిబంధ‌న‌ల వ‌ల్ల అమ్మాయిలు ప్రాథ‌మిక హ‌క్కును కోల్పోతున్నార‌ని కుష్ క‌ల్రా అనే న్యాయ‌వాది సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఎన్డీఏ, ఎన్ఏ ప‌రీక్షల‌కు అమ్మాయిల‌ను కూడ అనుమ‌తించేలా యూపీపీఎస్సీని ఆదేశించాల‌ని కోర్టును అభ్యర్థించారు. విచార‌ణ జ‌రిపిన కోర్టు అమ్మాయిల‌ను అనుమ‌తించేలా మ‌ధ్యంత‌ర ఉత్తర్వులు జారీ చేశారు.

About Author