NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అవకాశం ఇవ్వండి ఆలూరు అభివృద్ధి కోసం కృషి చేస్తా

1 min read

బిసివై పార్టీ అధినేత రామ చంద్ర యాదవ్ ని కలిసిన ఆలూరు నియోజకవర్గం వాల్మీకి యువనాయకుడు అడ్వకేట్ ఎల్లార్తి అర్జున్ .

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: 15.11.2023 వ తేదీన హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో బి.సి.వై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ని వాల్మీకి యువనాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి నాయుడు, కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లార్తి అర్జున్ తదితర యువకులు కలిసి రానున్న ఎన్నికల్లో వాల్మీకి బోయలకు సముచిత స్థానం ఇవ్వాలి అని 20 ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ స్థానాలలో జనాభా లెక్కల ప్రకారం అత్యధికంగా ఉన్న చోట వాల్మీకులకు బిసివై పార్టీ తరుపున అవకాశం కల్పించాలి అని కోరడం జరిగింది. ఆలూరు నియోజకవర్గ పరిధిలోని పరిస్థితుల గురించి వివరిస్తూ అత్యంత వెనకబడిన ప్రాంతం ఆలూరు నియోజకవర్గం అని నీళ్ళు, నిధులు లేక కరువు వలసలతో విలవిల లాడుతున్న ప్రాంతం కనుక వేదావతి నది ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి రైతులకు మరియు ప్రజలకు సాగునీటిని అందించడానికి తమరు తమవంతుగా కృషి చేయాలనీ విన్నవిస్తూ ఆలూరు నియోజకవర్గం నుండి యువనయకులు అడ్వకేట్ అర్జున్ కు అవకాశం ఇస్తే ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం, వెనుకబడిన వాల్మీకి, బీసీ, SC, ST లకోసం ఎల్లప్పుడూ కృషి చేస్తాడు అని రాష్ట్ర నాయకులు రామచంద్ర యాదవ్ ని కోరడం జరిగింది. అందుకు రామ చంద్ర యాదవ్ గారు సానుకూలంగా స్పందిస్తూ బి.సి.వై పార్టీలో ఖచ్చితంగా యువతకు ప్రాధాన్యత ఇస్తామని, రానున్న రోజుల్లో పార్టీకి యువత, వాల్మీకి బోయల అవసరం ఉంది అని మీరు అత్యధికంగా శ్రమించాలని బి.సి.వై పార్టీ (భారతీయ చైతన్య యువజన పార్టీ) అందరి పార్టీ అని అన్ని విధాలుగా ముందుకు పోతాం అని తప్పకుండా వాల్మీకి బోయలకు సముచిత స్థానం కల్పిస్తామని వారు హామి ఇవ్వడం జరిగింది.

About Author