NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగన్​వాడీలకు గ్రేడింగ్ ఇవ్వండి : జేసీ (డీ) మనజీర్ జిలానీ సమూన్

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు:పనితీరు ఆధారంగా అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లకు గ్రేడింగ్ ఇవ్వాలని ప్రాజెక్టు డైరెక్టర్ కే. ప్రవీణను జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) మనజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పురోగతిపై ప్రాజెక్టు డైరెక్టర్ కె. ప్రవీణ అధ్యక్షతన బుధవారం కలెక్టర్ సమావేశపు మందిరంలో సిడిపిఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకొచ్చే పిల్లల్లో లోప పోషణను పూర్తిగా సిడిపిఓలను ఆదేశించారు. తమతమ పరిధిలోని ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లోని ఒక గ్రామాన్ని ఎంచుకుని ఆ గ్రామాన్ని లోప పోషణ లేని గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసేటప్పుడు పిల్లల ఎత్తులు, బరువులను ప్రత్యక్షంగా పరిశీలించాలన్నారు.

సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు లోప పోషణ ఉన్న పిల్లల గృహాలను సందర్శించి వారి తల్లిదండ్రులకు పౌష్టికాహారం ఉపయోగాలు తెలియజేసి పిల్లల పెరుగుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. మహిళల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వన్ స్టాప్ సెంటర్ సిఎను ఆదేశించారు. అలాగే భార్యభర్తలకు సంబంధించిన గృహ హింస చట్టాన్ని ప్రకడ్బందిగా అమలు చేయాలని లీగల్ కౌన్సిల్​ ఆదేశించారు. ఈ సమీక్షలో జిల్లాలోని సిడిపిఓలు, సూపర్ వైజర్లు, ఐసిపిఎస్ నుంచి డిసిపిఓ, వన్ ప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్, శిశు గృహ మేనేజర్ పాల్గొన్నారు.

About Author