PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాపులకు ఒక్కసారి అవకాశం కల్పించండి..

1 min read

టిడిపి పార్టీ , జనసేన పార్టీ అధినాయకులు ఎవరిని ప్రకటించిన విజయానికి పనిచేస్తాం..

నియోజకవర్గంలో క్లీన్ చిట్ ఉన్న యువనేతను ప్రకటిస్తే విజయం తథ్యం

టిడిపి పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన సీనియర్ నేతల్లో మాజీ పై వ్యతిరేకత నిరుత్సాహం

ఎవరిని ప్రకటించిన పార్టీ గెలుపే మా లక్ష్యం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : దెందులూరు నియోజకవర్గం లో  కాపులు 40 శాతం తూర్పుకాపులు 20 శాతం  ఉన్నారు. మొత్తంగా చూస్తే నియోజకవర్గం లో 60 శాతం మంది కాపు సామాజిక వర్గం ఉంది. ఈ ప్రకారంగా చూస్తే దెందులూరు నియోజక వర్గం నుండి ఈ సారి టి డి పి నుండి లేదా జనసేన నుండి అయినా ఎం ఎల్ ఏ టిక్కెట్  ఈ సారి కాపులకు ఇవ్వాలని కోరుతున్నాము. లేదా జనసేన  టి డి పి పొత్తులో భాగంగాపార్టీ అధిష్టానాలు దెందులూరు సీటు ఎవరికిచ్చినా కలిసి పనిచేసిటి డి పి, జనసేన ఉమ్మడి అభ్యర్థినిగెలిపించు కుంటామని  కాపు సామాజిక వర్గ సీనియర్ నాయకుడు పులి శ్రీరాములు అన్నారు. దెందులూరు నియోజక వర్గం నుండి ఈ సారి అన్ని రకాలుగా క్లిన్ చిట్ ఉన్న కాపు సామాజిక వర్గ యువ నేత కొటారు ఆదిశేషు ను జనసేన అభ్యర్థిగ తమ మనసులోని మాట చెప్పారు. టిడిపి అధిష్టానం చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దెందులూరు నియోజకవర్గం లో ఎవరిని అభ్యర్థిగా ప్రకటించిన తాము శిరస వహించి పార్టీ గెలుపుకు కృషి చేస్తామన్నారు. మా కాపుల అభిప్రాయాన్ని జనసేన అధ్యక్షునికి.టి డి పి అధినేత చంద్రబాబుకి తెలుపుతామని  చెప్పారు. ఏలూరులోని పాండురంగ థియేటర్ సమీపం లో ఉన్న స్వాగత రెసిడెన్సీ లో గురువారం దెందులూరు నియోజక వర్గ టి డి పి జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎం ఎల్ ఏ అభ్యర్థి ఎంపిక పై అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటయ్యింది.ఈ సందర్భంగా టి డి పి  జనసేన  నాయకులు అభ్యర్థి ఎంపిక పై తమ అభిప్రాయాలను ఆయాపార్టీల అధిష్టానాలకు తెలిపేందుకు ఈ వేదికను ఏర్పాటు చేశారు.పెదవేగి మాజీ ఎం పి పి .రాట్నాలమ్మ దేవస్థానం మాజీ చైర్మన్.రాయల భాస్కరరావు మాట్లాడుతూ దెందులూరు నియోజక వర్గం లో చింతమనేని ప్రవర్తన బాగోలేదన్నారు. ప్రజా పట్లపార్టీ నాయకుల పట్ల ఉపయోగించే భాష బాగోలేదన్నారు. నియోజక వర్గంలో టి డి పి లో బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గమే చింతమనేని ని వ్యతిరేకిస్తోందని, కొంతమంది నాయకులు కార్యకర్తలు బయటపడలేకపోతున్నారని తెలిపారు. దెందులూరు నుండి 2024 ఎన్నికల్లో చింతమనేని తప్పజనసేన టి డి పి తరపున ఉమ్మడి అభ్యర్థి గా ఇంకెవరికిచ్చినా కలిసి పా ఇచ్చేసి గెలిపించుకుంటామని  రాయల భాస్కరరావు తెగేసి చెప్పారు.గత రెండురోజుల గా నియోజక వర్గం లో చింతమ నేని పర్యటిస్తూ ఈ సారి ఎన్నికల్లో నేను గెలిస్తే కొంతమంది నాకొడుకులు సూట్ కేసులు బ్యాగ్ లు సర్దుకుని ఊళ్ళు విడిచిపెట్టి పారిపోవాల్సిందే అంటూ రెచ్చిపోయి అసభ్య పదజారాలతో మాట్లాడుతున్నారని టిడిపి నాయకులు ఆలపాటి అమరేంద్రనాథ్ (దత్తు) రాయల భాస్కరరావు చింతమనేని ప్రవర్తనను దుయ్యబట్టారు. వైసిపి పార్టీపై నియోజకవర్గంలో పూర్తి వ్యతిరేకత ఉందని అభివృద్ధిలో శూన్యమైందని, జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా యువతను పూర్తిగా నిర్వీర్యం చేసిందని కొటారు ఆదిశేషు అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక కొత్త వ్యక్తిని ప్రకటిస్తే విజయం తధ్యమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానన్నారు. పొత్తు లో ఉన్న ఈ ఇరువురు ఎవరిని ప్రకటించిన తాము కష్టపడి గెలిపించుకుంటామని, పార్టీ విజయానికి కృషి చేస్తామని అన్నారు.

About Author