ఎమ్మెల్యే’గా అవకాశం ఇవ్వండి… అభివృద్ధి చేస్తా
1 min read– టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ టీజీ భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తాను ఎమ్మెల్యే అయితే కర్నూలు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ అన్నారు. గురువారం నగరంలోని 1వ వార్డుకు చెందిన యువతతో పాటు 47వ వార్డుకు చెందిన బ్రాహ్మణ సంఘం నాయకులు టిడిపిలో చేరారు. టిజి భరత్ వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టిజి భరత్ మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే కర్నూలు రూపురేఖలు మారుస్తానని చెప్పారు. స్థానికంగా పరిశ్రమలు వస్తే ఇక్కడి యువతకు ఉద్యోగాలు దొరుకుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్తిక్, జీవన్, మహదేవన్, సమీర్, శివప్రసాద్, రాఘవేంద్ర, ఫణిశేఖర్, వెంకట్రామయ్య, మారుతిశర్మ, గౌరి, భాస్కర్, సురేంద్ర, సాయి, తదితరులు పాల్గొన్నారు.