NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాతజీతాలే ఇవ్వండి.. పీఆర్సీ సాధన సమితి

1 min read

పల్లెవెలుగు వెబ్​: రాష్ట్ర PRC సాధన సమితి ఇచ్చిన మెరుపు పిలుపు మేరకు పత్తికొండ మండలంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు సంబంధిత DDO లకు జనవరి నెలకు సంబంధించి ప్రభుత్వమిచ్చిన ఉత్తర్వులమేరకు కొత్తజీతాలు చేయవద్దని వారు వినతి పత్రాలు సమర్పించారు.పాతజీతాలు చేయాలని వారు విన్నవించుకున్నారు.ఈ సందర్బంగా PRC సాధన సమితి నాయకులు సత్యనారాయణ మాట్లాడుతూ జనవరి నెలకు పాత జీతాలు చేయాలని,అశు తోష్ మిశ్రా కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని,అందులో ఏముందో ఉద్యోగులకు చూపించాలని,కొత్త PRC ఉత్తర్వులను రద్దుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.ఈ రోజు దేవనబండ ZP ఉన్నత పాఠశాలలో ఉద్యోగ ఉపాధ్యాయులతో కలిసి వినతి పత్రాలు సన్నాహక కార్యక్రమంలో పాల్గొని నినాదాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రమేష్ నాయుడు,సోమన్న,ఖలీలు,కదిరప్ప నాయక్, అనసూయమ్మ,సులోచనమ్మ,లలిత మొదలగు వారు పాల్గొన్నారు.

About Author