ఒక్క అవకాశం ఇవ్వండి.. పది లక్షల ఉద్యోగాలిస్తాం !
1 min readపల్లెవెలుగువెబ్ : గుజరాత్ ప్రజలపై హామీల వర్షం కురిపించారు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే అందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3000 భృతి చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. అహ్మదాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి ఆయన ఈమేరకు తెలిపారు.