PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌త్తు మందు ఇచ్చి.. పాత గ్యారెజ్ లోకి తీసుకెళ్లి.. 60 మంది

1 min read

జార్ఖండ్: జార్ఖండ్ లోని కంద‌ర్ బేరాలో దారుణం జరిగింది. స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునే ఘ‌ట‌న చోటుచేసుకుంది. చెప్పన‌ల‌వి కాని రీతిలో అత్యాచారం జ‌రిగింది. కంద‌ర్ బేరాలోని ఓ మ‌హిళ ను అప‌హ‌రించి …60 మంది నెల‌రోజుల పాటు అత్యాచారం చేశారు. మ‌త్తు మందు ఇచ్చి అప‌హ‌రించిన దుండ‌గులు… ఓ పాత‌బ‌డిన గ్యారెజ్ లో తీసుకెళ్లి.. చెప్పన‌ల‌వి కాని రీతిలో హింసించారు. మాట‌ విన‌క‌పోతే.. చిత్రహింస‌లు చేశారు. ప‌శువుల క‌న్నా హీనంగా..మృగాల క‌న్నా ఘోరంగా ఆడ‌పిల్లని అంగాంగం చిత్రవ‌ధ చేశారు. అయితే.. దుండ‌గుల క‌ళ్లు క‌ప్పి త‌ప్పించుకున్న యువ‌తి పోలీసుల‌ను ఆశ్రయించింది. త‌న‌కు జ‌రిగిన దారుణం గురించి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని విచారిస్తున్నారు. పోలీసుల క‌థ‌నం ప్రకారం ఆ యువ‌తి తీవ్రంగా గాయ‌ప‌డింది. త‌న‌ను అప‌హ‌రించిన స‌మ‌యం, తేది, స్థలం లాంటి అంశాల మీద స్పష్టంగా స‌మాచారం ఇవ్వలేద‌ని పోలీసులు తెలిపారు. ఆమె ఆరోగ్యం కుద‌ట‌ప‌డ్డాక‌.. మ‌రిన్ని విష‌యాలు తెలుసుకుని కేసు ద‌ర్యాప్తును వేగ‌వంతం చేస్తామ‌ని పోలీసులు తెలిపారు.

About Author