NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డ్ర‌గ్స్ ఇచ్చి.. గ్యాంగ్ రేప్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ లో దారుణం జ‌రిగింది. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థినికి డ్ర‌గ్స్ ఇచ్చిన నిందితులు గ్యాంగ్ రేప్ కు పాల్ప‌డ్డారు. ప‌దో త‌ర‌గ‌తి చ‌దివే మైన‌ర్ బాలిక ప్రైవేట్ పాఠ‌శాల‌కు వెళ్ల‌గా.. అడ్డ‌గించిన ఇద్ద‌రు వ్య‌క్తులు డ్ర‌గ్స్ ఇచ్చారు. అనంత‌రం బాలిక‌ను సాద్ పుర్ గ్రామ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లార‌ని బాలిక కుటుంబ స‌భ్యులు పోలీస్ స్టేష‌న్ లో పిర్యాదు చేశారు. అప్ప‌టికే అట‌వీ ప్రాంతంలో వేచి ఉన్న మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తుల‌తో క‌లిసి గ్యాంగ్ రేప్ కు పాల్ప‌డిన‌ట్టు తెలుస్తోంది. పోలీసులు, బాలిక త‌ర‌పు బంధువులు గాలింపు చేప‌ట్టారు.. అపస్మార‌క స్థితిలో ఉన్న బాలిక‌ను గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి న‌లుగురిలో ఇద్ద‌రిని అరెస్టు చేశామ‌ని, మిగిలిన వారి కోసం గాలిస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

                            

About Author