జీవో నెంబర్ 52 ఆర్డర్ ఇస్తూ … కమిషన్ ఏర్పాటు
1 min readపల్లెవెలుగు, వెబ్ నంద్యాల: వైయస్సార్ సిపి పార్టీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలోవాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుసూదన్ ఆదోని వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు బి దేవా మున్సిపల్ చైర్ పర్సన్ బోయ శాంత లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర లో వాల్మీకులను ప్రాంతీయవ్యత్యాసం తొలగించి ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే నిన్న జీవో నెంబర్ 52 ఆర్డర్ ఇస్తూ రిటైర్డ్ అధికారి శామ్యూల్ ఆనంద్ ఏక సభ్యుడిగా కమిషన్ ఏర్పాటు చేసింది మూడునెలల్లో దీనిపై నివేదిక అందించాలని ఆదేశాలిస్తూ రాష్ట్రంలో వాల్మీకులు దశాబ్దాలుగా పోరాటాలతో ఉద్యమాలు చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపుగా 40 లక్షల జనాభా ఉన్న వాల్మీకులను సెంట్రల్ ఎస్టీ కమిషన్ కి పంపించడం వాల్మీకి లో జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మాట తప్పడు అని గత ప్రభుత్వాలు మాదిరి గా కాదని క్యాబినెట్ లో ఆమోదం చేసి సెంట్రల్ పంపించి మల్ల ఎస్టీ కమిషన్ కు పంపడం చాలా సంతోషకరం జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతీయత వ్యత్యాసాన్ని తొలగించి ఎస్టీ జాబితాలో కలిపితే జగన్మోహన్ రెడ్డి గారిని మా గుండెల్లో పెట్టుకుని వాల్మీకుల అంతా చూసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలోస్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రేణుక మాజీ మండల అధ్యక్షుడు పంపాపతి కౌన్సిలర్లు సురేష్ కిషోర్ సుధాకర్ కేశవ సోము భరత్ శివ రాముడు పెద్దయ్య బి టి లక్ష్మన్న శంకర్ లక్ష్మీనారాయణ దస్తగిరి నాయుడు విరుపాక్షి తిమ్మప్ప సీతారాం వెంకటేష్ జైపాల్ వి కే వెంకటేశులు తమన్నా చందు వీరేష్ నాగరాజ్ రంగస్వామి దేవేంద్ర యువరాజ్ హనుమంతు సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.