DRT బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా జికె దేశ్ పాండే ఎన్నిక
1 min readహోరాహోరీగా సాగిన డెబిట్ రికవెరి ట్రిబ్యునల్ బార్ అసోసియేషన్ ఎన్నికలు
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : హైదరాబాద్ త్రివేణి కాంప్లెక్స్‌లో గురువారం డెబిట్ రికవెరి ట్రిబ్యునల్ (DRT) బార్ అసోసియన్ ఎన్నికలు హోరాహోరీగా జరిగిగాయి. బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి సీనియర్ న్యాయవాది జి.కె. దేశ్‌పాండే, మరో న్యాయవాది బి. సంజయ్ కుమార్ పోటీ పడ్డారు. ఎన్నికలు అధికారుల పర్యవేక్షణలో ఈ ఎన్నికలు ఉదయం 11 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగాయి. అనంతరం 5.30 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించారు.కౌంటింగ్‌లో జికె దేశ్‌పాండేకి 24 ఓట్లు రాగా, బి సంజయ్ కుమార్‌కు 23 ఓట్లు వచ్చాయి. హోరాహోరీగా సాగిన కౌంటింగ్‌లో 1 ఓటు మెజారిటీతో జికె దేశ్‌పాండే విజయం సాధించారు. అలాగే వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్ వి సుబ్బరాజు , జి పూర్ణిమ పోటీ పడ్డారు. వీరిలో ఎన్ వి సుబ్బరాజు 25 ఓట్లు సాధించి వైస్ ప్రెసిడెంట్‌గా విజయం సాధించారు. అలాగే జాయింట్ సెక్రెటరిగా కె. కల్యాణ్ చక్రవర్తి, ట్రెజరర్‌గా అదిరన్ కిరణ్ రాజ్, లైబ్రేరియన్‌గా టి రణ్‌దీర్ సింగ్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్ (మేల్) గా ఎ. నరేష్, జె. నరేంద్ర కుమార్, శ్రవణ్ కుమార్ రాగి గెలుపొందారు. ఈ ఎన్నికలలో జనరల్ సెక్రటరీగా డి. రాఘవులు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీగా సిహెచ్ కిషోర్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్ (ఫిమేల్)గా జి పుష్కల, పి రాజేశ్వరి లు ఏక్రగ్రీవంగా ఎన్నికకావడం విశేషంDRT బార్ అసోసియేషన్‌లో మొత్తం 49 ఓట్లు ఉండగా.. 47 మంది ఓటు వినియోగించుకున్నారు. సీనియర్ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి, అభయ్ సింగ్, పిఎస్ ఎన్ రవీంద్ర తో సహా పలువురు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు ఎన్నికల్లో విజయం సాధించిన జికె. దేశ్‌పాండే, సుబ్బరాజు తదితరులకు పూలమాలలు వేసి ఘనంగా అభినందించారు. న్యాయవాదులంతా స్వీట్లు పంచుకున్నారు.ఈ సందర్భంగా DRT బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన జికె దేశ్‌పాండే మాట్లాడుతూ.. DRT బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడానికి సహకరించిన సహచర న్యాయవాదులందరికి కృతజ్ఞతలు తెలిపారు. DRT అసోసియేషన్ అభివృద్ధికి అందరి సహకారంతో పాటు పడతానని పేర్కొన్నారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ ఎన్నికల నిర్వహణ అధికారులుగా కె. బుచ్చిబాబు, పి. శ్రీ. రాజేశ్వరి, ఎస్ శ్రీకాంత్‌లు వ్యవహరించారు.