PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలోని ఎస్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నగర మున్సిపల్ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. నగరానికి చెందిన  ప్రతి ఒక్క కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులు,వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య మేయర్​ నూర్జహాన్​ పెదబాబు కేక్​ కట్​ చేశారు. అంతకు ముందు పూలమాలు, బొకేలతో మేయర్​ దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గులాబ్ తుఫాన్ తో  రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా కొంత బాధను వ్యక్తం చేశారు. ఆడంబరాలకు తావు లేకుండా నిడారంభంగానే పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదములు తెలిపారు. తనపై నమ్మకంతో మేయర్​ పదవి అలంకరించేలా చేసిన సీఎం వైఎస్​ జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని కి  రుణపడి ఉంటానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. మహిళా కార్పొరేటర్లు,ఏపీ ఎన్జీవోస్ జిల్లా ఉపాధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్,హీరో షోరూం చీఫ్ జనరల్ మేనేజర్ ఏవి సోమేశ్వ రావు తదితరులు మేయర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

About Author