ఘనంగా తెర్నేకల్ సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు : నగరంలోని సీతారాంనగర్‌లో వైసీపీ అదనపు రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వ్యక్తిగత కార్యాలయంలో జరిగిన పార్టీ వేడుకల్లో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. అంతేకాక పంప్‌హౌస్ వద్ద ఉన్న పట్టణ నిరాశ్రయుల కేంద్రంలో, ఆర్టీసీ బస్టాండ్ వెనకున్న డాన్ బోస్కో నిలయంలో అనాథలకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ… పేదల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిత్యకృషీవలుడు గా పనిచేస్తున్నారని, తండ్రి బాటలో పయనిస్తూ… ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారన్నారు. కార్యక్రమంలో వైసిపి నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్రెడ్డి గ్రంథాలయ జిల్లా చైర్మన్ సుభాష్ చంద్రబోస్, నాయకుల c h మద్దయ్య, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ రాఘవేంద్రరెడ్డి, డైరెక్టర్లు, కార్పోరేటర్లు కృష్ణకాంత్ రెడ్డి, వైసిపి జిల్లా ట్రేడ్ యూనియన్ నాయకులు కఠారి సురేష్, వైసిపి 43 వార్డు ఇన్ ఛార్జీ మల్లిఖార్జున, మైనార్టీ నాయకులు తోఫిక్, ఆసిఫ్ యువజన నాయకులు ధనుంజయాచారి, రాజశేఖర్, కొండా రెడ్డి నాని తో పాటు పలువురు కార్పోరేషన్ల డైరెక్టర్లు గవర్నమెంట్ ప్రెస్ యూనియన్ నాయకులు జీజీహెచ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యదర్శి తెర్నేకల్ సురేందర్రెడ్డి జన్మదిన వేడుకలను కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.ఈ మేరకు నగరంలోని పలుచోట్ల ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు ఈమేరకు కర్నూలు నగరం సీతా రాం నగర్ లోని తన వ్యక్తిగత కార్యాలయంలోనూ, శ్రీరామ్ నగర్ లోనూ భారీ కేకును కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం పంప్ హౌస్ వద్ద ఉన్న పట్టణ నిరాశ్రయుల కేంద్రంలోనూ, ఆర్టీసీ నూతన బస్టాండ్ వెనుక వైపున ఉన్న డాన్ బోస్కో నిలయంలో అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు ప్రముఖ ప్రజాప్రతినిధులు ఆయనకు ఫోన్లో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ… పేదల సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిత్యకృషీవలుడు గా పనిచేస్తున్నాడని అన్నారు. తండ్రి బాటలో ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా హామీలను అధిగమించే వైపు ముఖ్యమంత్రి పయనిస్తున్నాడన్నాడని అన్నారు. జీవిత పర్యంతం వరకు ఆయన అడుగుజాడల్లో పయనిస్తానని చెప్పారు. కార్యక్రమంలో వైసిపి నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్రెడ్డి గ్రంథాలయ జిల్లా చైర్మన్ సుభాష్ చంద్రబోస్ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ రాఘవేంద్రరెడ్డి, డైరెక్టర్లు, కార్పోరేటర్లు కృష్ణకాంత్ రెడ్డి, వైసిపి జిల్లా ట్రేడ్ యూనియన్ నాయకులు కఠారి సురేష్, వైసిపి 43 వార్డు ఇన్ ఛార్జీ మల్లిఖార్జున, మైనార్టీ నాయకులు తోఫిక్, ఆసిఫ్ యువజన నాయకులు ధనుంజయాచారి, రాజశేఖర్, కొండా రెడ్డి నాని తో పాటు పలువురు కార్పోరేషన్ల డైరెక్టర్లు గవర్నమెంట్ ప్రెస్ యూనియన్ నాయకులు జీజీహెచ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.