వైభవం.. ఆంజనేయుడి పల్లకోత్సవం..
1 min readపల్లెవెలుగు వెబ్, ఆదోని : పట్టణంలోని క్రాంతినగర్‌లో వెలిసిన శ్రీమత్ ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణంలో శుక్రవారం హనుమాన్ జయంతిని భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయమే ఆలయ పూజారి రామదాస్ స్వామివారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. సాయంత్రం శ్రీమత్ ఆంజనేయ స్వామి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు బుదార్పు లక్ష్మన్న, ఉపాధ్యక్షులు పాలుట్ల వెంకటేశ్వర శెట్టి ఆధ్వర్యంలో స్వామివారిని పురవీధుల గుండా పల్లకిలో ఊరేగించారు. అంతకు ముందు హనుమాన్ చాలీసా పారాయణం ఘటించారు. ఈ సందర్భంగా బుదార్పు లక్ష్మన్న మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలను అనుసరించి హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు.
ఆలయ కమిటీ సభ్యుల సహకారం.. ప్రజల తోడ్పాటుతో శ్రీమత్ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు బుదార్పు లక్ష్మన్న ఈ సందర్భంగా వెల్లడించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో కమిటీ కోశాధికారి జక్కా వీరేష్, సభ్యులు పుట్టా రామాంజనేయులు, రామకృష్ణ, జె.రామాంజనేయులు, మల్లికార్జున, క్యామ శ్రీనివాసులు, ఎం. ఉరుకుందు, శేషాద్రి, దేవరాజ్, యువరాజ్, హర్ష తదితరులు పాల్గొన్నారు.