వైభవం.. దక్షిణామూర్తి ఆరాధనోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్, ఆస్పరి: కర్నూలు జిల్లా ఆస్పరి మండల పరిధిలోని కారుమంచి గ్రామంలో కొలిచేవారికి కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ దక్షిణామూర్తి స్వాములవారి 29 వ ఆరాధనోత్సవాలను గురువారం గ్రామ పెద్దలు, భక్తులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆరాధన ఉత్సవాలను పురస్కరించుకొని ఉదయం స్వామి వారికి ప్రభాతసేవ, గంగ పూజ, స్వామి సమాధికి పంచామృతాభిషేకం, శ్రీ గాయత్రీ మాత మహాయజ్ఞం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీ దక్షిణామూర్తి స్వామి వారి రథోత్సవంను స్వాముల వారి ఆలయం నుండి శివాలయం వరకు జయజయ ధ్వనుల మధ్య భక్తులు రథాన్ని ముందుకు లాగగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించుకొని తిరిగి యథాస్థానానికి చేర్చారు. వచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి భజన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా హెడ్ కానిస్టేబుల్ నాయక ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ దక్షిణామూర్తి సేవాశ్రమ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మి కౌలుట్లయ్య, మాజీ సర్పంచ్ ఆత్మానంద, ఎంపిటిసి అభ్యర్థి రాజన్న గౌడ్, గ్రామ పెద్దలు రవి ప్రకాష్ రెడ్డి, అంజినయ్య, దరగయ్య, సాగునీటి సంఘం మాజీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, తెలుగు పండిట్ రామాంజనేయులు పాల్గొన్నారు.