వైభవం… ధ్వజస్ధంబ ప్రతిష్టాపనోత్సవం..
1 min read
పల్లెవెలుగు రాయచోటి/వీరబల్లి: వీరబల్లి మండలంలోని వంగిమళ్ళ గ్రామం పెద్దహరిజనవాడలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆదివారం ధ్వజస్థంభ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. వేదపడితుల వేదమంత్రాల నడుమ, గణపతి పూజ, హోమాలు, ద్వజారోహణము, ఇతర పూజలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
గండికోట సుబ్బరామయ్య, అంజనమ్మ దంపతులు ధ్వజస్థంభాన్ని తయారు చేయించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ పూజారి అప్పిగాళ్ళ జయరామయ్య, వీఆర్వో వెంకటరమణ, రామయ్య, వీరనాగయ్య, రామ్మోహన్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.