NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైభవం..మహాశివరాత్రి ఉత్సవం

1 min read
శ్రీగిరిక్షేత్రంలో వెలిసిన పంచలింగేశ్వర స్వామి ​

శ్రీగిరిక్షేత్రంలో వెలిసిన పంచలింగేశ్వర స్వామి ​

– శ్రీగిరిక్షేత్రంలో.. నేటి నుంచి ప్రారంభం
పల్లెవెలుగు, ఆస్పరి;
మండలపరిధిలోని బెణిగేరి గ్రామ సమీప కొండలలో వెలిసిన శ్రీశ్రీశ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయంలో గురువారం నుంచి శనివారం (మూడు రోజులు)వరకు మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. గురువారం ఉదయం శ్రీగణపతి పూజ, రుద్రహోమం, మధ్యాహ్నం 2 గంటల నుంచి పార్వతీ పరమేశ్వర్ల ఉత్సవ మూర్తులను రామిరెడ్డి, చంద్రారెడ్డి అనే భక్తుల ఇంటి నుంచి పల్లకిలో ఊరేగిస్తారు. రాత్రికి శ్రీగిరి క్షేత్రానికి చేర్చుతారు. శుక్రవారం రాత్రి 1 గంటకు అభిషేకాలు ప్రారంభించి.. తెల్లవారు జామున 3 గంటలకు గంగపూజ, వృషభలగ్నం నందు శివపార్వతుల కళ్యాణోత్సవంను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవాలకు దాతలు చిన్నహోతురు ధర్మరాజు, చాకలినగన్న,కోతులఉత్తయ్య, చెవులరామన్న, తలారిభీమన్న, బాలకొండప్ప, రాజు, ఉమాశంకర్, సుధాకర్, హనుమంతురావు, సుదర్శన్ఆచారాలు, భాస్కర్ రెడ్డి, మహాలక్ష్మమ్మ, రాఘవేంద్రకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆలయ ధర్మకర్త శ్రీనివాస నాయన, సతీమణి రమాదేవి తెలిపారు.

About Author