వైభవం… పద్మశాలి వనభోజన మహోత్సవం…
1 min readపల్లెవెలుగు వెబ్, ఎమ్మిగనూరు :కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో పద్మశాలి కార్తీక వనభోజన మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఎమ్మిగనూరు పట్టణ బహత్తమ సంఘం, పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదోని బైపాస్ రోడ్డులోని సుశీలాంభ దేవాలయం పక్కన ఎస్ఎంటీ కాలనీలో ఊసిరి చెట్టు వద్ద వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఉదయమే పద్మశాలి ఆడపడుచులు ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కార్తీక వనభోజన కార్యక్రమానికి వైసీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి తనయుడు కడిమెట్ల ఎర్ర కోట జగన్మోహన్ రెడ్డి, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు కొంగతి లక్ష్మినారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే చేనేతలకు మంచి గుర్తింపు ఉందని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేనేతల ఆర్థికాభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అనంతరం మహిళలకు ముగ్గుల పోటీలు,మిమిక్రీ ప్రొగ్రాం, డ్యాన్స్ తదితర పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో 34వ వార్డు కౌన్సిలర్ విశ్వనాథ పద్మావతమ్మ, బోడా అన్నపూర్ణమ్మ, పట్టణ బహుత్తమ సంఘం సభ్యులు శాసన్ శివదాస్, సిద్ధా గురుదాస్, అధ్యక్షులు విశ్వనాథ్ రమేష్, ఎంఆర్ శ్రీనివాసులు, దోమ భీమేష్, మాన సత్యనారాయణ, మధు, కృష్ణమూర్తి, ఎస్వీ రఘునాథ్, బెనకయ్య, మోకం నారాయణ, జాన రంగస్వామి, కేబీ ఈరన్న, గుడిపాటి రవి, పోలే ప్రసాద్, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు పోలే శీను, మేడం వెంకటస్వామి, బోడ గోవిందు, కోడి రఘు, ఆడిమి వీరేష్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.