వైభవం.. పత్తికొండ ఈరన్న స్వామి పల్లకోత్సవం
1 min read
పల్లెవెలుగు వెబ్, పత్తికొండ : కర్నూలు జిల్లా పత్తికొండ –ఆదోని ప్రధాన రహదారి ప్రక్కన వెలసిన శ్రీ వీరన్న స్వామికి శ్రావణమాసం 5వ సోమవారం పల్లకోత్సవం నిర్వహించారు. అంతకు ముందు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. దేవాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. వీరన్న స్వామివారికి కుంకుమార్చనలు, పంచామృత అభిషేకాలు, పల్లకీ సేవ ఉత్సవాలు జరిపారు. పల్లకి సేవ ఉత్సవం మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో స్వామివారిని ఊరేగించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు గోవింద్ గౌడ్ ,శ్రీనివాస్ గౌడ్, పూజారులు ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆదోని, ఆస్పరి, ఆలూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.