వైభవం.. సీతారామయ్యస్వామి ఆరాధన మహోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు : మండల కేంద్రమైన కలసపాడు శివారులోని ఎగువ సగిలేరునదీ ప్రాంగణంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ సీతారామయ్య స్వామి వారి 77వ వసంత ఆరాధన మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం శోభాయాత్ర, స్వామి వారికి కళశారాధన, పుష్పార్చన, నిర్వహించారు. తదనంతరం చిన్మయ మిషన్ కడప అధ్యక్షులు శ్రీ శ్రీ శ్రీ తురీయానంద సరస్వతీ కార్యక్రమంలో ప్రధాన వక్తగా వచ్చి గురుత్వంపై ప్రసంగించారు. ఈ దేశపు ధార్మిక నైతిక ఆధ్యాత్మిక తత్వం ప్రపంచ దేశాలకు ఆదర్శమని, అటువంటి గురుపరంపరకు ఈ దేశం ఆలవాలమన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మచారి నారాయణ చైతన్యజి, బ్రహ్మచారి వేంకట రమణజి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కాతా వేంకట సుబ్బారెడ్డి సభాధ్యక్షత వహించారు. ZPTC అంకన గురివిరెడ్డి, వైసిపి నాయకులు ఎస్.రామకృష్ణారెడ్డి, చిత్తా రాజశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పురుషోత్తమ రెడ్డి, యం.పి.టి.సి. షరీఫ్ , వైసిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి గుండం వెంకట సూర్య ప్రకాశ్ రెడ్డి, సర్పంచ్ ఎడమకంటి శివలీలశ్రీధర్ , జీ.ప.ఉ.పా.ప్రధానాచార్యులు ,పి.వి. రమణారెడ్డి, ఉపాధ్యాయులు , రమణమ్మ, కృష్ణవేణి, ఆర్.ఎస్.ఎస్. నాయకులు కల్లూరి రామకృష్ణా రెడ్డి,అక్కిశెట్టి శ్రీనువాసులు, పీరారెడ్డి, సి.నాగేంద్ర, పరంధామయ్య,ఏకల్ ఉపాధ్యాయులు మంజుల, జనహిత కార్యకర్తలు, పులి రంగారెడ్డి, బుసికె రామచంద్రారెడ్డి, దుత్తల రాజగోపాల్ రెడ్డి, చాటకొండు బాలకృష్ణ,చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.