వైభవం.. ఉగాది సంబరం..
1 min read– గోనెగండ్ల లో ఘనంగా శ్రీ ప్లవనమ సంవత్సర వేడుకలు
*ఆంజనేయ ఇనుప విగ్రహ, ప్రభ ఊరేగింపు
*ప్రత్యేక ఆకర్షణగా పావుకోళ్ల సందడి…
పల్లెవెలుగు వెబ్, గోనెగండ్ల: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని .. మండల కేంద్రంలోని శ్రీ సీతా రామాంజనేయ దేవాలయం, ఈశ్వర , వినాయక , శ్రీ రామ దేవాలయాల్లో ఆలయ పూజారి శివయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు దేవాలయాలకు మామిడాకుల తోరణాలు, పూలతో అందంగా అలంకరించారు. అలాగే మారెమ్మ అవ్వ దేవాలయం, సుంకులమ్మ అవ్వ దేవాలయాల్లో భక్తులు ఊరేగింపుగా వచ్చి మొక్కుబడులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీతా రామాంజనేయ భజన మండలి ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి ఇనుప విగ్రహం గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించి .. సంజీవరాయ కొండపై ఇనుప విగ్రహాన్ని ప్రతిష్టించారు. సాయంత్రం శ్రీ శ్రీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నుండి ఊరి చివర ఉన్న ఈశ్వర దేవాలయం వరకు ప్రభను ఊరేగిస్తూ కోలాటం భజనలతో, పావుకోళ్ల ఆటల సందడి చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. ఈ ప్రభ ఊరేగింపును దర్శించుకునేందుకు గ్రామంలో కులమతాలకతీతంగా ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని ఊరేగింపులో దర్శించుకున్న దర్శించుకుంటారు. అలాగే సంజీవరాయ కొండపైకి ఎక్కి ప్రజలు ప్రభ ఊరేగింపును మరియు గోనెగండ్ల గ్రామం నాలుగు దిక్కులలో పచ్చదనంతో నిండి ఉన్న గ్రామ ఏరియల్ వ్యూ దర్శించి ఆనందించేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.