వైభవం.. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్, ప్రొద్దుటూరు: కాలజ్ఞాన ప్రదాత, రచయిత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 328 ఆరాధన మహోత్సవాలను భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కాలజ్ఞాని స్వామివారు సజీవ సమాధి విశిష్టలోకి వెళ్లిన రోజు కావడంతో శుక్రవారం శ్రీ బ్రహ్మరథం వ్యవస్థాపకులు కృష్ణమాచార్య నేతృత్వంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రొద్దుటూరు పట్టణం రామేశ్వరం రోడ్ పెన్నా నది వద్ద ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందమాంబ వారి విగ్రహమునకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణామాచార్య మాట్లాడుతూ వైశాఖ శుద్ధ దశమి రోజున సాక్షాత్తు విష్ణు స్వరూపులు, జగద్గురు, జగత్ విఖ్యాత శ్రీశ్రీశ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సజీవ సమాధి నిష్ఠ వహించి 327 సంవత్సరాలు పూర్తి చేసుకుని 328 వ సంవత్సరం లోకి అడుగు పెట్టారని, భక్తులందరూ ఆయురారోగ్య సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కొత్తూరు వెంకటసుబ్బారెడ్డి, మురళి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు .