వైభవం.. శ్రీదేవీ భూదేవీ సమేత వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం..
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు పాత నగరంలోని చిత్తారివీధి చౌరస్తా లో ఉన్న అత్యంత పురాతనమైన, శ్రీ 1008 శ్రీ నరహరి తీర్థ స్వాములవారు ప్రతిష్టించిన ఆంజనేయ స్వామి( శ్రీ పేట ఆంజనేయ స్వామి) వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ,మంగళవారం శ్రీదేవి, వేంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. , వేదవిదులైన బ్రాహ్మణులు మంగళాష్టకాలు చదువుతూ లోకకళ్యాణం కోసం,లోకాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వ్యాధి ఉపశమించాలన్న సంకల్పంతో శ్రీవారి కళ్యాణం జరిగింది. సాయంకాలం దివ్యమంగళ రథోత్సవం జరుగుతుంది.
వేంకటేశ్వర స్వామి వారికీ,ఆంజనేయ స్వామి వారికీ సుప్రభాతసేవ,విశేషం పంచామృతాభిషేకం,మహాలంకార పూజ,అష్టోత్తర సహస్రనామార్చన,మహా నైవేద్యం, మహామంగళ హారతి నిర్వహింపబడ్డాయి. అనంతరం బ్రాహ్మణ, సంతర్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానార్చకులైన ముంజి రాఘవేంద్ర ప్రసాద్,డా.గురురాజ్,పవన్ ముంజి, సగరం శ్రీనివాస్, టి.టీ.డీ. ఉపసంపాదకులు కాల్వ నరసింహ, ఆర్.జే.గురురాజ్,విశ్వహిందూపరిషత్ నగర కార్యర్శి భాను ప్రకాష్ మాళిగి రుద్రవరం లక్ష్మణ్, ముంజి విఠల్ జయరాం,రఘురాం, మరియూ మహిళలూ,అశేష భక్తజనసందోహం పాల్గొన్నారు.