‘ముస్లిం ‘ లకు ‘ జి ఎన్ ఆర్’ ఇఫ్తార్ విందు…
1 min read
సేవ చేయడం…. పుణ్య ఫలం..
జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య
కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు జిల్లాలోని గాయత్రి స్టేట్లో బిర్లా గడ్డ మసీదులో ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య. రంజాన్ పండుగ అంటేనే ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా నెల రోజులపాటు ఎంతో పవిత్రంగా ఉపవాసం ఉంటూ పండుగను జరుపుకుంటారు ఇలాంటి పవిత్ర మాసంలో జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య ఈరోజు సాయంత్రం మసీదులో గురువారం 100 మందికి ఇఫ్తార్ విందును ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత నాగేశ్వరయ్య డాక్టర్, డాక్టర్ వంశీకృష్ణ, డ్యూటీ డాక్టర్ నాగేంద్ర, జిఎన్ఆర్ మెయింటెనెన్స్ ఇంచార్జ్ కుమార్, మేనేజర్ శివ, ల్యాబ్ టెక్నీషియన్ నరసింహ, పొడిచెర్ల భాష, తిమ్మప్ప, భాష ,కలిల్ ,ఆరోగ్య మిత్ర అయూబ్, జిఎన్ఆర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
