ఇంటికి వెళ్లి పెంక్షన్ పంపిణీ…
1 min read
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఆలూరు తాలూకా ఇన్చార్జి వీరభద్ర గౌడ్ ఆదేశాల మేరకు..
హొళగుంద, న్యూస్ నేడు: హోళగుంద మండల కేంద్రంలోని స్థానిక పలు ఏరియాలో ఏప్రిల్ 1వ తారీఖున సచివాలయం సిబ్బందితొ కలిసి పించేను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హోళగుంద టీడీపీ సీనియర్ నాయకులు & యువ నాయకులు…టీడీపీ నేతలు మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన ప్రకారంగా చేసి చూపించారని ప్రతి నెల తూచ తప్పకుండా సరిగ్గా 1వ తారీఖున సచివాలయం సిబ్బందితో పింఛన్లు దారులకు వృద్ధులకు & ఒంటరి మహిళలకు 4000 /-రూపాయిలు మరియు వికలాంగులకు 6000 /- రూపాయిలు పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది అని అందుకుగాను టీడీపీ నేతలు మన కూటమి ప్రభుత్వంనికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పంపాపతి, మాజీ వైస్ ఎంపీపీ ఏర్రీశ్వామి,సీనియర్ నాయకులు దిడ్డి వెంకటేష్, మంగలి వెంకటేష్, అంజినేయలు, హోటల్ వీరయ్య స్వామి,యువ నాయకుడు మంజునాథ్ గౌడ్ మరియు పించన్ దారులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
