PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే జీఓ ను అమలుపరచాలి

1 min read

వాల్మీకి సంఘం( ఆత్మకూరు)

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: రాజకీయంగా ఆర్థిక సామాజిక పరంగా అన్ని రంగాలలో అత్యంత వెనుకబడిన వాల్మీకి బోయ కులస్తులను బీసీ ల జాబితా నుండి ఎస్టీ ల జాబితా లోకి చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక వాల్మీకి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానించిన GO NO:52 ను వెంటనే అమలు పరచాలని కోరారు. ఎలాంటి కులవృత్తి లేని వాల్మీకి బొయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఈ సమస్య న్యాయ పరమైనదని డిమాండ్ చేస్తూ సోమవారం రోజున నంద్యాల జిల్లా ఆత్మకూరు లో సమావేశం నిర్వహించి వాల్మీకి సంఘ సభ్యులు తీర్మానించారు. ఆత్మకూరు లో ఈ సంఘ నాయకులు మాట్లాడుతూ గతంలో వాల్మీకులు ST జాబితాలో ఉండేవారని ,రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ST లుగా ఉన్నారని వీరిని రాష్ట్ర వ్యాప్తంగా ST ల లల్లో చేర్చాలని వీరు కోరారు.రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిన బిల్లును కేంద్రంలో కూడా ఆమోదించాలని వాల్మీకులు డిమాండ్ చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో దీప కాలేజీ రమణ ,స్టూడియో వెంకట్రాముడు ,పాలశివ, టైలర్ వేకటేశ్వర్లు , రిపోర్టర్ నాగరాజుల నాయకత్వంలో వారు మాట్లాడుతూ వాల్మీకుల చిరకాల స్వప్న మైన ST సాధన కోసం విజ యవాడలో పెనుగొండ ఈశ్వరయ్య సత్యాగ్రహ దీక్ష చేశారని అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే వాల్మికులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని కొన్ని పార్టీల నాయకులు ఓట్లు దండుకుని గద్దె నెక్కాక హామీలను విస్మరించడం పరిపాటిగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో ఒకచోట STలుగా ,మరోచోట BC లుగా పరగనించేల రెండు నిభందనలు వర్తింప చేయడం దారుణ మన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో బోయలు ఎస్టీ లుగా , ఎస్సీ లుగా కొనసాగితే ఏపీ లో మాత్రం అందుకు భిన్నంగా ఉండడం శోచనీయం అన్నారు.వాల్మీకి బోయలు ఎదగ కుండా పాలకులు అణిచి వేస్తున్నారని ఇది తగదన్నారు. . ఈకార్యక్ర మంలో వాల్మీకి సంఘం నాయకులు డ్రైవర్ మల్లి,నారాయణ, శివ , నాగరాజు ,రంగస్వామి , విశ్వనాథ్ తది తరులు పాల్గొన్నారు.

About Author