NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాకు న‌చ్చిన‌ప్పుడే పార్లమెంటుకు వెళ్తా !

1 min read

పల్లెవెలుగు వెబ్​ :రాజ్యస‌భ స‌భ్యులు, జ‌స్టిస్ రంజ‌న్ గొగొయ్ పార్లమెంట్ స‌మావేశాల హాజ‌రు పై ఆస‌క్తిక‌రంగా స్పందించారు. త‌న‌కు న‌చ్చిన‌ప్పుడే రాజ్యస‌భ‌కు వెళ్తాన‌ని, పార్టీ విప్ ల‌తో త‌న‌కు సంబంధం లేద‌ని స్పష్టం చేశారు. అసోం నుంచి వ‌చ్చిన తాను ఈశాన్య రాష్ట్రాల స‌మ‌స్యల‌పై గ‌ళం విప్పాల‌ని భావించాన‌ని, క‌రోన వ్యాప్తి.. వైద్యుల సూచ‌న మేర‌కు స‌మావేశాల‌కు హాజరుకావ‌డం లేదని చెప్పారు. ఈ మేర‌కు రాజ్యస‌భ‌కు లేఖ పంపించాన‌ని తెలిపారు. తాను మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని భావిస్తేనే రాజ్యస‌భ‌కు వెళ్తాన‌ని, తాను నామినేటెడ్ ప‌ద్ధతిలో ఎన్నికైన స‌భ్యుడిన‌ని.. త‌న‌ను ఏపార్టీ విప్ ఆదేశించ‌లేద‌ని తెలిపారు. క‌రోన విజృంభిస్తున్నప్పటికీ స‌భ‌లో భౌతిక దూరం పాటించ‌డంలేద‌ని, సీటింగ్ అరేంజ్ మెంట్ కూడ అసౌక‌ర్యంగా ఉంద‌ని చెప్పారు.

About Author