NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాయ‌ల చెరువుకు గండి .. 100 ప‌ల్లెల‌కు ప్ర‌మాదం !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : ఏపీలో భారీ వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. గ‌తానికి భిన్నంగా రాయలసీమలో వాన‌లు  అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో తిరుపతి రామచంద్రాపురంలోని రాయల చెరువు కట్టకు స్వల్ప గండి పడటంతో వరద నీరు లీకవుతోంది. చెరువు కట్ట నుంచి ట్టి కొద్దికొద్దిగా జారుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.  ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు సమీప ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఒకవేళ రాయల చెరువు తెగితే సుమారు వంద పల్లెలకు ముంపు ప్రమాదం పొంచి వుందని అధికారులు చెబుతున్నారు. దీంతో చెరువు దిగువన పల్లెలను అధికారులు అప్రమత్తం చేశారు. అంతేగాక రాయల చెరువు మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. సంతబైలు, ప్రసన్న వెంకేటశ్వరపురం, నెన్నూరు, గంగిరెడ్డిగారిపల్లి, సంజీవరాయపురం, కమ్మపల్లి, గొల్లపల్లె, కమ్మకండ్రిగ, నడవలూరు,వెంకట్రామపురం, రామచంద్రాపురం, మెట్టూరులో ప్రజలను అప్రమత్తం చేశారు. పల్లెలు ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని అంచనా వేస్తున్నారు. ఒక‌వేళ చెరువు తెగితే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలన్న దానిపై స‌మాలోచ‌న చేస్తున్నారు.

https://ssl.gstatic.com/ui/v1/icons/mail/no_photo.pngReplyForward

About Author