NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంటింటికి వెళ్లి.. మ‌గాళ్లను లాక్కొచ్చి !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆప్ఘనిస్థాన్ లో తాలిబ‌న్లు న‌ర‌మేధం సృష్టిస్తున్నారు. ఆప్ఘనిస్థాన్ ను సులువుగా ఆక్రమించుకున్న తాలిబ‌న్లకు.. పంజ్ షిర్ కొర‌క‌రాని కొయ్యగా మారింది. పాక్ స‌హాయంతో పంజి షిర్ లోయ‌లో భీక‌ర దాడి చేశారు. పంజ్ షిర్ ను ఆక్రమించుకున్నామ‌ని తాలిబ‌న్లు ప్రక‌ట‌న చేశారు. అయితే.. త‌మ పోరాటం ఇంకా కొన‌సాగుతోంద‌ని ఉత్తర కూట‌మి నేత‌లు ప్రక‌టించారు. తాలిబ‌న్లు ఆక్రమించుకున్న కొన్ని ప్రాంతాల్లో న‌ర‌మేధం సృష్టిస్తున్నారు. త‌మ‌కు వ్యతిరేకంగా ప‌నిచేస్తున్న ఇళ్లల్లోకి వెళ్లి యువ‌కుల‌ను లాక్కొచ్చి.. కాల్చి చంపుతున్నారు. వంద‌లాది కుటుంబాలు పారిపోతున్నార‌ని అక్కడి ప్రజ‌లు ట్విట్టర్ ద్వార వెల్లడించారు. అంత‌ర్జాతీయ స‌మాజం త‌మ‌కు ఎందుకు స‌హాయం చేయ‌డం లేద‌ని పంజ్ షిర్ ప్రజ‌లు ప్రశ్నిస్తున్నారు.

About Author