దేవుడు చెప్పాడట.. పార్టీలో చేరాడట !
1 min readపల్లెవెలుగువెబ్ : మాజీ సీఎం దిగంబర్ కామత్, సీఎల్పీ నేత మైఖేల్ లోబో తదితరులు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో బీజేపీ కండువాలు కప్పుకున్నారు. దీనిపై దిగంబర్ కామత్ స్పందించారు. బీజేపీలో చేరేముందు తాను, ఇతర బీజేపీ ఎంపీలు దేవుడి అనుమతి తీసుకున్నామని చెప్పారు. దేవుడు సరే అన్నాడని, తాము బీజేపీలో చేరామని తెలిపారు. తనకు దేవుడిపై నమ్మకం ఉందని కామత్ వెల్లడించారు.