NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌ర్వతారోహ‌ణ‌కు వెళ్లి 11 మంది మృతి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : భారీ వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మ‌వుతున్న ఉత్తరాఖండ్ లో మ‌రో విషాధం చోటుచేసుకుంది. ప‌ర్వతారోహ‌ణ‌కు వెళ్లిన ట్రక్కర్లు మంచుచ‌రియ‌లు విరిగిప‌డి మ‌ర‌ణించారు. ఉత్తరాఖండ్, హిమాచ‌ల్ ప్రదేశ్ మ‌ధ్య ఉండే హార్సిల్ – చిట్కుల్ ట్రెక్ రూట్ లో ప‌ర్వతారోహ‌ణ‌కు వెళ్లిన 11 మంది బెంగాళీ ట్రెక్కర్లు మంచుచ‌రియ‌లు విరిగిప‌డి గ‌ల్లంత‌య్యారు. ఉత్తరాఖండ్ పోలీసులు వాయుసేన స‌హాయంతో గాలింపు చేప‌ట్టారు. దాదాపు 17వేల అడుగుల ఎత్తులో ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్ స‌హాయంతో రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. గ‌ల్లంత‌యిన వారిలో 7గురి మృతదేహాల‌ను క‌నుగొన్నారు. ఇద్దరిని కాపాడ‌గా.. మ‌రో ఇద్దరు గ‌ల్లంత‌య్యారు.

About Author